బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాగల 24 గంటల్లో శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు కదులుతుందని, దీని ప్రభావంతో రేపు అన్నమయ్య, చిత్తురు, తిరుపతి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయంది. ఎల్లుండి నుంచి అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంది.