వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సజ్జల ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో విచారణ చేపట్టిన హైకోర్టు.. ఎటువంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు సూచించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలను మరో రెండు వారాలపాటు పొడిగించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.