అచ్యుతాపురం మండలంలో రెవెన్యూపరమైన అంశాలను పరిష్కరించాలని సిపిఎం మండల కన్వీనర్ ఆర్ రాము విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వెదురువాడలో నిర్వహించిన రెవిన్యూ సదస్సులో అధికారులకు వినతిపత్రం అందజేశారు.
మండలంలో 143 మంది దళితులు వ్యవసాయ కూలీలకు 100 ఎకరాలు భూములు పంపిణీ చేసి డి. పట్టాలు అందజేసినట్లు తెలిపారు. ఆ భూములకు సబ్ డివిజన్ చేసి హద్దులు ఏర్పాటు చేయాలని కోరారు.