బాల్య వివాహాల నిర్మూలనకు అందరూ ముందుకు రావాలని పరవాడ ఎంపీడీవో శ్యాంసుందర్ పిలుపునిచ్చారు. బుధవారం పరవాడ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన కిశోరి వికాసం కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. బాలికలను ఉన్నత విద్యావంతులుగా చేయాలన్నారు. బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.