మాడుగుల మండలం, జాలంపల్లి పంచాయతీ, కామకూటం గ్రామంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ షెడ్ కు మాడుగుల నియోజకవర్గం శాసనసభ్యులు బండారు సత్యనారాయణమూర్తి బుధవారం భూమి పూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పుప్పాల అప్పలరాజు స్థానిక నాయకులు అధికారులు, ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం అక్కడ జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు.