చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రజలపై బాదుడే..బాదుడు మొదలైందని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాలు, మోసాలపట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ప్రతీ నెలా ఒక్కో అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ ఉమ్మడి ప్రకాశం జిల్లా వైయస్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులతో వైయస్ జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా వైయస్ జగన్ పార్టీ నేతలతో మాట్లాడారు.అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే ఎప్పుడూ చూడని వ్యతిరేకత ఈ ప్రభుత్వం పట్ల కనిపిస్తోంది. మనకున్న వ్యక్తిత్వం, విశ్వసనీయత వల్లే మనం రేపు మళ్లీ అధికారంలోకి వస్తాం. చంద్రబాబు అబద్ధాలు, మోసాలపట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. అందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. ప్రతీ నెలా ఒక్కో అంశాన్ని పట్టుకుని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.