సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఆర్ అండ్ ఆర్ కాలనీ లక్ష్మాపూర్ గ్రామంలో బుధవారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం వద్ద ఆలయ పూజారి పిట్ల పరశురాములు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ సమ్మక్క సారలమ్మ గోశాలను హంపి పీఠాధిపతి శ్రీ విద్యానంద భారతి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పూజారి హిట్లర్ పరశురాములు మాట్లాడుతూ సమ్మక్క సారలమ్మ అనుగ్రహంతో అందరూ బాగుండాలని,
గత కొన్ని సంవత్సరాల క్రితం సమ్మక్క సారలమ్మ విగ్రహాలను ఇక్కడ ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని మేడారంలో ఉన్న సమ్మక్క సారాలమ్మ ప్రాంతం ఉన్న విధంగా ఇక్కడ ఉన్నదని భక్తుల కోరిన కోర్కెలు నెరవేర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న సమ్మక్క సారలమ్మ ఆలయంలో వద్ద గోశాలను ప్రారంభించడం జరిగిందని అని అన్నారు. భక్తులు అమ్మవార్లను దర్శించుకుని గోవులకు పూజలు చేసి వారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు