చీపురుపల్లి మండలం ఆకులపేట గ్రామంలో బుధవారం మానవతీయ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గరివిడి కంటి ఆసుపత్రి వైద్యులు పర్యవేక్షణలో ఈ కంటి వైద్య శిబిరం.
నిర్వహించినట్లు మానవతీయ అధ్యక్షులు గోవిందరాజులు తెలిపారు. వైద్య శిబిరంలో పలువురు పేదలకు ఉచిత కంటి వైద్య పరీక్షల నిర్వహించారు. కాగా 18 మందికి శస్త్ర చికిత్స అవసరమని వారికి కంటి ఆపరేషన్లు చేస్తున్నట్లు తెలిపారు.