స్మాల్ క్యాప్ కంపెనీ అయిన అరుణ్ జ్యోతి బయో వెంచర్స్ లిమిటెడ్ స్టాక్ అదరగొట్టింది. కేవలం 5 ఏళ్ల కాలంలోనే లక్ష రూపాయలను రూ. 1 కోట్లు చేసింది. ఇప్పుడు మరో కీలక ప్రకటన చేసింది. తమ షేర్ హోల్డర్ బేస్ పెంచుకునేందుకు, లిక్విడిటీని పెంచేందుకు స్టాక్ స్ప్లిట్‌ను ప్రతిపాదించింది. షేర్ల విభజన చేసిన క్రమంలో ఈ స్టాక్ మళ్లీ ఫోకస్ లోకి వచ్చింది. దీంతో పాజిటివ్ ట్రెండ్‌లో ట్రేడింగ్ అవుతోంది. మరి ఈ స్టాక్ గురించి ఇప్పుడే వివరాలు తెలుసుకుందాం.
స్టాక్ స్ప్లిట్..
అరుణ్ జ్యోతి బయో వెంచర్స్ లిమిటెడ్ కంపెనీ స్టాక్ స్ప్లిట్ చేపట్టేందుకు ప్రతిపాదించింది. 10:1 రేషియోలో స్టాక్ స్ప్లిట్ చేపట్టనున్నట్లు తెలిపింది. అంటే రూ. 10 ముఖ విలువ కలిగిన 1 ఈక్విటీ షేరును రూ. 1 ముఖ విలువ గల 10 షేర్లుగా విభజించనుంది. ఇందుకు సంబంధించిన రికార్డ్ తేదీని త్వరలోనే ప్రకటించనుంది. రికార్డ్ తేదీ నాటికి తమ డీమ్యాట్ అకౌంట్లో ఈ కంపెనీకి చెందిన 1 షేరు కలిగి ఉంటే 10 షేర్లుగా మారనున్నాయి.
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు..
అరుణ్ జ్యోతి బయో వెంచర్స్ లిమిటెడ్ కంపెనీని 1986లో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు. కో ప్యాకింగ్ కంపెనీల్లో ఒకటైన ఈ సంస్థ మల్టీనేషనల్ కార్పొరేషన్లకు క్యాటెరింగ్ సేవలు అందిస్తోంది. తొలి నాళ్లలో ఈక్విటీ కమోడిటీ ట్రేడింగ్, వెల్త్ మేనేజ్మెంట్, సాఫ్ట్వేర్ డెవల్మెంట్ వంటి రంగాల్లో ఉన్నా ఈ సంస్థ 2022 నుంచి ఎఫ్ఎంసీజీ, బ్రేవరేజ్ రంగాలపై దృష్టి సారించింది. ఇప్పుడు తెలంగాణలోని జనగాంలో 2 ఎకరాల 6 గంటుల బూమి కొనుోగలు చేసేందుకు సిద్ధమైంది.
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ నెట్ సేల్స్ రూ.6.35 కోట్లుగా నమోదు చేసింది. ఇక నెట్ లాస్ రూ. 0.41 కోట్లుగా చూపించింది. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 300 కోట్లకుపైగా ఉంది. గత మూడేళ్ల స్టాక్ ప్రైస్ సీఏజీఆర్ 350శాతంగా ఉంది. గత ఏడాదిలోనే ఈ స్టాక్ 360 శాతం పెరిగింది. గత మూడేళ్లలో 9000 శాతం లాభాలు ఇచ్చింది. ఇక గత 5 సంవత్సరాల్లో చూస్తే 10 వేల శాతం పెరిగింది. అంటే లక్ష రూపాయల పెట్టుబడిని కోటి రూపాయలు చేసి చూపించింది. ఈ కథనం సమాచారం కోసం మాత్రమే. ఎలాంటి పెట్టుబడిని ప్రోత్సహించేందుకు కాదు. అన్ని విషయాలు తెలుసుకున్నాకే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలి. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంటుంది.