బంగారం కొనుగోలు చేసే వారికి భారీ ఊరట. ఇవాళ దేశీయంగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మాత్రం గోల్డ్ రేట్లు భారీగా దిగివచ్చాయి. దీంతో దేశీయంగానూ తగ్గే సూచనలు ఉన్నాయి. డిసెంబర్ 13వ తేదీన ఉదయం 7 గంటల సమయంలో 22 క్యారెట్ల బంగారం రేటు హైదరాబాద్‌లో రూ. 72 వేల 850 పలుకుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు తులానికి రూ. 79 వేల 470 వద్ద ఉంది. మరోవైపు.. వెండి రేటు మరోసారి రూ.1000 పెరిగింది. దీంతో కిలో సిల్వర్ ధర రూ.1,04,000 స్థాయికి ఎగబాకింది.