వికారాబాద్ జిల్లా పూడూర్ మండలంలోని ఎన్కెపల్లి గ్రామ పరిధిలోని హిట్స్ కాలేజ్ సమీపంలో ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆలయం తప్ప భక్తుల సౌకర్యార్థం కానీ, అయ్యప్ప స్వాములు ఉండేందుకు ఎలాంటి గదులు లేవు. దీంతో రానున్న రోజుల్లో అయ్యప్ప మాలధారణ స్వాములు ఆలయం వద్ద ఉండేలా ఏర్పాట్లు చేయడంలో భాగంగా సన్నిధానం గది నిర్మాణానికి సంకల్పించారు.
నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వాముల సన్నిధానం నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించాలని చేవెళ్ల మండల పరిధిలోని హస్తేపూర్ గ్రామానికి చెందిన యువనాయకుడు కిష్టాపురం హరీశ్ ను కోరారు. స్పందించిన హరీశ్ గురువారం కుటుంబ సభ్యులతో కలిసి ఆలయం వద్దకు వెళ్లి 100 బస్తాల సిమెంట్ కు సరిపడా డబ్బులను అయ్యప్ప సన్నిధానం నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు హరీశ్ దంపతులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో కూడా అయ్యప్ప స్వాముల సన్నిధానం అభివృద్ధికి తన వంతు సాయం చేస్తానని తెలిపారు. ఇంకా దాతలు ముందుకొచ్చి సన్నిధానం నిర్మాణానికి సహకరించాలని కోరారు.