కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ఆలయ హుండీ లెక్కింపును ఈ రోజు చేపట్టినారు. 73 రోజుల హుండీ ఆదాయం వివరాలను ఆలయ కార్యనిర్వాహక అధికారి తెలియజేశారు. నగదు 81,68,044 రూపాయలు, మిశ్రమ బంగారం 146 గ్రా౹౹, మిశ్రమ వెండి 05కి౹౹200గ్రా.లు, విదేశీ కరెన్సీ 26 నోట్లు మిశ్రమ బియ్యం- 550 కిలోలు వచ్చినాయి. ఈ హుండీ లెక్కింపు లో శివ రామ కృష్ణ భజన మండలి సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కొమురవెళ్లి ఆలయ కార్యనిర్వహణాధికారి ఏ బాలాజీ,ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, ఆలయ ధర్మకర్తలు లింగంపల్లి శ్రీనివాస్, ఎం లక్ష్మి, జయ ప్రకాష్ రెడ్డి, అల్లం శ్రీనివాస్, కే మోహన్ రెడ్డి, కొమురవెల్లి ఎస్ఐ రాజు, పోలీస్ సిబ్బంది, ఆలయ సహాయ కార్య నిర్వహణాధికారి బుద్ధి శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీరాములు, సురేందర్ మరియు ఆలయ అర్చకులు, సిబ్బంది, ఏపిజివిబి బ్యాంకు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.