కోదాడ పట్టణంలో ఉన్న పాన్ షాప్ దుకాణాలలో రహస్యంగా గుట్కా వ్యాపారం జరిపిస్తున్నారని సమాచారం. నిషేధిత తంబాకు, పొగాకు, గుట్కాలు, విచ్చలవిడిగా షాప్ యజమానులు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని పట్టణంలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత యువత మత్తు పదార్థాలకు అలవాటు పడుతున్న తరుణంలో మత్తు పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఆంధ్ర-తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో గంజాయి విక్రయించే అవకాశాలు ఉన్నాయని, వాటికి తోడు గుట్కాలు రహస్యంగా అమ్ముతున్నారని సమాచారం. పాన్ షాపులలో, కిరాణం దుకాణాలలో పోలీసులు తనిఖీలు చేయడం లేదనే మాటలు వినిపిస్తున్నాయి. ఇకనైనా కోదాడ పట్టణంలో పాన్ షాప్ లలో, దుకాణాలలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టి నిషేధిత గుట్కా,ఉత్పత్తుల పై ఉక్కుపాదం మోపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు..