ట్రెండింగ్
Epaper    English    தமிழ்

010 అమలు చేయాలని ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయులు నిరసన..!

Education |  Suryaa Desk  | Published : Sat, Dec 14, 2024, 12:53 PM

నల్గొండ జిల్లా దామచర్ల మండలంలోని బొత్తల పాలెం ఆదర్శ పాఠశాలలో 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని, నేషనల్ సర్వీస్ ను కల్పించాలని హెల్త్ కార్డులు అందజేయాలని, తదితర అంశాల పరిష్కారానికి పీఎండిఏటిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పిలుపుమేరకు ఆ సంఘం ఉపాధ్యక్షుడు బాబ్లా నాయక్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు 
ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు ఇట్టి కార్యక్రమానికి మద్దతుగా పిఆర్టియు మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మందుల అశోక్ కుమార్, కుంభం సైదిరెడ్డి , సోమలింగం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పోతురాజు నరహరి ఉపాధ్యాయులు హుస్సేన్ ,భాస్కర్ రెడ్డి ,రాజు ,రాము ,లక్ష్మణ్ రావు ,శ్రీనునాయక్, ప్రసాద్, అనిత ,సఫియా భాను, రవికాంత్, జయప్రకాష్ ,విద్యాసాగర్ ,సమీనా, సతీష్ ,శ్రవణ్ , రహీం ,రాంబాబు దుర్గా పాల్గొన్నారు ‌.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com