ప్రస్తుతం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లుకు కనీసం దేశంలోని 50 శాతం రాష్ట్రాల ఆమోదం తెలపాలన్న నిబంధన వర్తించదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాజ్యాంగాన్ని సవరించే అధికారం 368 ఆర్టికల్ ద్వారా పార్లమెంటుకు సంక్రమించిందని గుర్తు చేశాయి.
ఒకే దేశం.. ఒకే ఎన్నిక బిల్లులపై కేంద్రంలోని మోదీ సర్కారు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. తాజాగా లోక్‌సభ బిజినెస్ జాబితా నుంచి జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను తొలగించడమే ఇందుకు కారణం. వాస్తవానికి డిసెంంబరు 16న లోక్‌సభ ముందుకు బిల్లులు తీసుకొచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఆ మేరకు లోక్‌సభ బిజినెస్ జాబితాలో కూడా వీటిని చేర్చింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్ ఈ బిల్లు పెడతారని కేంద్రం తెలిపింది కానీ.. తాజాగా, రివైజ్డ్ లోక్‌సభ బిజినెస్ జాబితాలో జమిలి ఎన్నికల బిల్లులు మాయమైనట్టు సమాచారం. ఈ నెల 20తో పార్లమెంటు సమావేశాలు ముగియనున్నాయి.
ఈ పరిణామాలు నేపథ్యంలో.. గడువు ముగిసేలోగా ఈ శీతాకాల సమావేశాల్లో బిల్లులు స్రవేశపెట్టడం సందిగ్దత నెలకొంది. పార్లమెంట్‌తో రాష్ట్రాల అసెంబ్లీలకు జమిలి ఎన్నికల అమలు కోసం రాజ్యాంగంలో కొత్తగా 82ఎ ఆర్టికల్‌ను చేర్చాల్సి ఉంటుంది. పార్లమెంటు పదవీ కాలంలో మార్పు కోసం..ఆర్టికల్ 83ని, అసెంబ్లీల పదవీ కాలం సవరణకు..ఆర్టికల్ 172ని, ఎన్నికల నిబంధనల రూపకల్పన కోసం పార్లమెంటుకు అధికారం కల్పించే.. ఆర్టికల్ 327ను సవరించాల్సి ఉంటుంది.
లోక్‌సభ, అసెంబ్లీలతో పాటే స్థానిక సంస్థల ఎన్నికలనూ నిర్వహించాలని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల అంశాన్ని కేంద్ర క్యాబినెట్ ప్రస్తుతానికి పక్కనబెట్టి.. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన రెండు బిల్లులకు ఈ నెల 12న ఆమోదం తెలిపింది.
జమిలి ఎన్నికల బిల్లు ఆమోదం పొంది చట్టంగా మారితే.. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఐదేళ్లకు ఒకసారి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి. అప్పటి వరకు అధికారంలో కొనసాగాల్సిన ప్రభుత్వాలు ఏదైనా పరిస్థితుల్లో రద్దయినా... ఆయా అసెంబ్లీలు /లోక్‌సభకు మాత్రమే...ఐదేళ్లలో మిగిలి ఉన్న కాలం కోసమే మధ్యంతర ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ గడువు ముగిసిన తర్వాత అన్ని శాసనసభలు, లోక్‌సభతో పాటే ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి. ప్రస్తుతం తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లుకు కనీసం దేశంలోని 50 శాతం రాష్ట్రాల ఆమోదం తెలపాలన్న నిబంధన వర్తించదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాజ్యాంగాన్ని సవరించే అధికారం 368 ఆర్టికల్ ద్వారా పార్లమెంటుకు సంక్రమించిందని గుర్తు చేశాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa