ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తలలో చెయ్యి పెట్టగానే జుట్టు తెగ రాలిపోతుందా..? సీతాఫలం గుజ్జు, ఆకులు, గింజల్ని ఇలా వాడితే

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Dec 15, 2024, 11:04 PM

సీతాఫలం ఈ సీజన్‌లో ఎక్కువగా దొరికే పండు. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. నోటికి తియ్యని రుచి.. మెత్తగా ఉండటంతో ఖర్చు ఎక్కువైన సరే దీనిని తినడానికే ఇష్టపడతారు. మామిడి పండు తర్వాత దీనినే మధుర ఫలం అంటారు ప్రజలు. సాధారణంగా మనం సీతాఫలాన్ని ఆకుపచ్చ రంగు తొక్క, తెల్లటి గుజ్జు, నల్లటి గింజలతోనే చూస్తాం. కానీ చాలా ప్రాంతాల్లో ఇవి ఎరుపు రంగులో కూడా ఉంటాయి. పర్పుల్, పింక్ కలర్‌లో కూడా కనిపిస్తాయి.సీతాఫలంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీనిలో పోషకాల మెండు.


ఈ పండులో విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు, విటమిన్ బి6, పొటాషియం, మెగ్నిషియం ఎన్నో ఖనిజాలు, పోషకాలు ఉన్నాయి. ఈ ఫలంలో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి ఎన్నో రోగాల నివారణలో కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టు సంరక్షణలో కూడా సీతాఫలం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఖనిజాలు, విటమిన్లు ఎక్కువగా ఉండే ఈ పండు జుట్టుకు పోషణను అందించడంతో పాటు పెరుగుదలను వేగవంతం చేస్తుంది. జుట్టు రాలడం, చుండ్రు, పొడి జుట్టు వంటి సమస్యలతో బాధపడేవారికి సీతాఫలం సహజ పరిష్కారం. సీతాఫలంతో జుట్టుకు ప్రయోజనాలు, దాన్ని ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.


సీతాఫలంతో జుట్టుకు ప్రయోజనాలు..


జుట్టు పెరుగుదల..సీతాఫలంలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ పండులో విటమిన్ బి6, విటమిన్ సి ఉన్నాయి. ఇవి జుట్టుకు తగిన పోషణ ఇస్తాయి. అంతేకాకుండ జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తాయి. ఈ పండు స్కాల్ప్‌ను హెల్తీగా మార్చడంలో పాటు హెయిర్ రూట్స్‌ను స్ట్రాంగ్‌గా మారుస్తాయి.


చుండ్రు సమస్యకు చెక్..


చలికాలంలో చాలా మంది చుండ్రు సమస్యతో బాధపడతారు. ఇలాంటి వారికి సీతాఫలం చక్కటి పరిష్కారం. సీతాఫలంలో యాంటీ ఆక్సిడెంట్లు, మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి స్కాల్ప్‌ను హైడ్రేట్‌గా ఉంచుతాయి. దీంతో.. చుండ్రు సమస్య తగ్గిపోతుంది.


సిల్కీ, మెరిసే జుట్టు..


సీతాఫలం పండులోనే కాదు గింజల్లో కూడా పోషకాలు ఉంటాయి. సీతాఫలం గింజల నుంచి తీసిన నూనె జుట్టుకు తగిన పోషణ అందిస్తుంది. ఈ నూనె జుట్టును సిల్కీగా, మెరిసేలా చేస్తుంది. జుట్టుకు తగ్గిన తేమను అందిస్తుంది. దీంతో.. జుట్టు పొడిబారకుండా ఉంటుంది.


జుట్టు రాలడాన్ని నివారిస్తుంది..


​జుట్టు రాలడం అనే సమస్య చాలా మందిని వేధిస్తుంది. కొందరు తలలో చేతులు పెట్టగానే వెంట్రుకలు ఊడి వస్తున్నాయి. సీతాఫలంలో ఉండే ఐరన్, పొటాషియం జుట్టు మూలాలకు తగిన పోషణనిస్తాయి. దీంతో.. జుట్టు బలంగా మారుతుంది.


శిరోజాల్ని శుభ్రపరుస్తుంది..


సీతాఫలంలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఈ గుణాలు స్కాల్ప్‌ను బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. దీంతో జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అంతేకాకుండా జుట్టు శుభ్రపడుతుంది.


సీతాఫలాన్ని ఎలా ఉపయోగించాలి?


సీతాఫలం హెయిర్ మాస్క్..


ఆరోగ్యకరమైన జుట్టు కోసం సీతాఫలాన్ని రకరకాలుగా వాడవచ్చు. సీతాఫలం హెయిర్ మాస్క్ జుట్టుకు తగిన పోషణ ఇస్తుంది. ఇందుకోసం ముందుగా పండిన సీతాఫలాన్ని తీసుకుని దాని గుజ్జును బయటకు తీయండి. గుజ్జులో కొబ్బరి నూనె, అలోవెరా జెల్ కలపండి. ఈ మూడింటిని బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత జుట్టు కుదుళ్ల వరకు బాగా అప్లై చేయండి. ఆ తర్వాత ఈ మాస్క్‌ను 30 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టును వాష్ చేయండి.


సీతాఫలం గింజల నూనె..


సీతాఫలం పండులోనే కాదు గింజల నూనెలో కూడా పోషకాలు ఉంటాయి. అందుకే సీతాఫలం గింజల నూనె జుట్టు సంరక్షణలో కీలకపాత్ర పోషిస్తుంది. సీతాఫలం గింజల నూనెను తలపై అప్లై చేయడం వల్ల జుట్టుకు లోతైన పోషణ లభిస్తుంది. ఇందుకోసం సీతాఫలం గింజల నూనెను కొద్ది వేడి చేయండి. ఆ తర్వాత తలకు అప్లై చేసి మసాజ్ చేయండి. రాత్రంతా అలాగే ఉంచండి. ఆ తర్వాత ఉదయాన్నే తేలికపాటి షాంపూతో తలస్నానం చేయండి.


హెయిర్ రిన్స్..


సీతాఫలం ఆకుల్లో కూడా బోలెడు మ్యాటర్ ఉంది. దీన్ని ఆయుర్వేదంలో బాగా వాడతారు. ఆయుర్వేదంలో సీతాఫలం ఆకులతో బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. ఇక, జుట్టు సంరక్షణ కోసం ముందుగా సీతాఫలం ఆకుల్ని తీసుకుండి. ఆ తర్వాత వీటిని నీటిలో వేసి మరిగించాలి. ఆ తర్వాత నీటిని చల్లార్చి.. వాటితో జుట్టును శుబ్రం చేసుకోండి. దీంతో జుట్టులోని మురికి అంతా వదిలిపోతుంది.


గుర్తుంచుకోవలసిన విషయాలు..


సీతాఫలం గింజలను నేరుగా జుట్టుకు అప్లై చేయండి. వారానికి రెండు నుంచి మూడు సార్లు సీతాఫలం హెయిర్ మాస్క్ ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. తలపై ఏదైనా అలర్జీ సమస్యలు వస్తే వైద్యుణ్ని సంప్రదించండి. సీతాఫలం మీ జుట్టును ఆరోగ్యంగా, సిల్కీగా, మెరిసేలా చేస్తుంది. రెగ్యులర్‌గా వాడితే మంచి ఫలితాలుంటాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa