చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు అయింది. తిరుపతి జిల్లా యర్రావారిపాలెం మండలానికి చెందిన 14 ఏళ్ల బాలికపై అత్యాచారం వార్తలను సోషల్ మీడియాలో ప్రసారం చేశారన్న ఆరోపణలతో ఆయనపై పోక్సో చట్టం కింద కేసు నమోదైంది.ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. చెవిరెడ్డి పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన కోర్టు తదుపరి విచాణను ఈ నెల 24కు వాయిదా వేసింది. మరోవైపు, అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది.