పిసిసి అధ్యక్షురాలు షర్మిల 50వ జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ గజపతినగరం నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ దుర్గాప్రసాద్ ముందుగా గజపతినగరంలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం సాధువులకు, నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. షర్మిల మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. నేతలు బుచ్చిరాజు, రవితేజ, రాంబాబు, కపిల్ పాల్గొన్నారు.