మచిలీపట్నంలోని రాబర్ట్ సన్ పేట పరిధిలో ఉన్న మెయిన్ రోడ్డులో దొంగతనానికి యత్నం జరిగింది. ఆరు షాపులు తాళాలు పగలగొట్టి దొంగతనం చేసేందుకు దుండగులు పాల్పడినట్టు మంగళవారం ఉదయం చూసిన యజమానులు పోలీసులకు తెలిపారు. కార్తికేయ, బిగ్ సి, ధాత్రి, వెంకటేశ్వర మొబైల్స్ నాలుగు మొబైల్ షాప్ లు, ఒక మెకానిక్ షాప్, ఒక ఇంటర్నెట్ షాపు తాళాలు పగులకొట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.