గంజాయి అక్రమ రవాణా పై ప్రత్యేక దృష్టి సారించాలని విశాఖపట్నం డిఐజి గోపీనాథ్ జెట్టి ఆదేశించారు. మంగళవారం శ్రీకాకుళం పట్టణంలోని ఒకటవ పోలీస్ స్టేషన్ ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి వినియోగం పట్ల ప్రత్యేక దృష్టి సారించి వాటి నియంత్రణకు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతూ ఉండాలని సూచించారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆయనతో ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa