గజపతినగరం పరిధిలోని పురిటిపెంట పంచాయతీ పరిధి షరాబుల కాలనీకి ఆనుకుని చంపావతి నదిలో సోమవారం చేపల వేటకు వెళ్లినవారికి పెద్ద కొండ చిలువ చిక్కింది. చేపల కోసం నదిలో వల వేయగా.. సుమారు 16 అడుగుల కొండ చిలువ పడింది. దీంతో ఆ కొండ చిలువను వల నుంచి తప్పించి సుదూర ప్రాంతంలో విడిచి పెట్టారు. కాగా ఈ భారీ కొండ చిలువను చూసేందుకు పరిసర గ్రామాల ప్రజలు భారీ సంఖ్యల తరలిచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa