ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2025లో ఏలియన్స్‌తో కాంటాక్ట్, పెను యుద్ధాలు.. కలవరపెడుతోన్న బాబా వంగా జోస్యం

international |  Suryaa Desk  | Published : Tue, Dec 17, 2024, 08:09 PM

బల్గేరియాకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాంజెలియా పాండేవా గుష్టెరోవా అంటే ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ, బాబా వాంగా అంటే గతంలో ఆమె చెప్పిన పలు జోస్యాలు గుర్తుకొస్తాయి. అగ్రరాజ్యం అమెరికాలో అల్‌ఖైదా ఉగ్రవాదుల 9/11 దాడులు, బ్రెగ్జిట్ సహా అనేక అంశాలపై గతంలో బాబా వాంగా అంచనాలు నిజమయ్యాయి. దీంతో వాంగా చెప్పే జోస్యం ఫలిస్తుందని ఐరోపా సహా ప్రపంచం మొత్తం బలంగా నమ్ముతారు. పన్నెండేళ్ల వయసులో కంటిచూపును కోల్పోయిన ఆమెకు.. అదే తనకు వరమని చెప్పేవారు. నోస్ట్రోడామన్ ఆఫ్ బాల్కన్‌గా గుర్తింపు పొందిన ఈ అంధ ఆధ్యాత్మికవేత్త.. మరికొన్ని రోజుల్లో మొదలయ్యే కొత్త ఏడాది 2025కు సంబంధించి ఆమె చెప్పిన జోస్యాలు ప్రస్తుతం మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఈ అంచనాలు అంతర్జాతీయంగా అశాంతి, విధ్వంసాలకు మూలమయ్యేలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.


1. వాతావరణంలో అపూర్వమైన మార్పులు


వాతావరణంలో అపూర్వమైన మార్పులు భూమికి మరింత ముప్పుగా పరిణమిస్తాయి.. దీని వల్ల వరదలు, తుఫాన్లు, హరికేస్లు, సునామీలు సహా తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయని అంచనా వేశారు.


2. ఇంధన విప్లవం


ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయి.. కొత్త వనరుల ఆవిష్కారం జరుగుతుంది.. దీంతో శిలాజ ఇంధనాలపై ఆధారపడటం తగ్గుతుంది. క్లీన్ ఎనర్జీ పరిష్కారంలో కొత్త శకం మొదలువుతుంది.


3. మెడిసిన్‌లో కొత్త ఆవిష్కరణలు


మానవాళి ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక మొండి వ్యాధులకు 2025లో ఔషధాలు అందుబాటులోకి వస్తాయి జన్యు చికిత్స, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స విధానంలో పురోగతి ఉంటుంది.


4. అంతరిక్షంలో కీలక పరిణామం


అంతరిక్షంలో ఇప్పటి వరకూ అంతుచిక్కని పలు రహస్యాలు తెలుసుకుంటారు. 2025లో అంతరిక్ష ప్రయోగాలు జోరుందకుని.. విశ్వం గురించి మరింత లోతైన అవగాహన పెంచుకుంటారు.


5. ఐరోపా విధ్వంసం..


పశ్చిమ దేశాల్లో యుద్ధం మొదలై, పెను విధ్వంసం జరుగుతుంది.. సిరియా పతనం ముగిసిన వెంటనే పశ్చిమ, తూర్పు దేశాల మధ్య భారీ యుద్ధం జరగొచ్చు.. వసంతకాలంలో మొదలయ్యే యుద్ధం మూడో ప్రపంచ యుద్ధంగా మారొచ్చు.. తూర్పులో మొదలయ్యే యుద్ధం పశ్చిమాన్ని నాశనం చేస్తుంది. సిరియా విజేత కాళ్ల మీద పడుతుందని, అయితే ఒక్కరు కాదు అని అంచనా వేశారు. పాత మిత్రులను పక్కనబెట్టి కొత్త భాగస్వాములతో మైత్రి.. ప్రపంచనాయకత్వంలో మార్పుల వల్ల అంతర్జాతీయ సంబంధాలు ప్రభావితమవుతాయి.


6. ఏలియన్స్‌తో కాంటాక్ట్


‘2025లో గ్రహాంతర వాసులతో మానవులకు కాంటాక్ట్ ఏర్పడొచ్చు... ఈ పరిణామం బహుశా ప్రపంచ సంక్షోభానికి లేదా వినాశనానికి దారి తీస్తుంది’ అని హెచ్చరించారు. ఫ్లైయింగ్ సాసర్లపై నాసా పరిశోధనలకు సంబంధించిన అన్ని ఫైల్స్‌ను విడుదల చేస్తానంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ జోస్యానికి ప్రాధాన్యత ఏర్పడింది.


7. ఇతర అంచనాలు


అలాగే, 2025 చివరి నాటికి టెలీపతి అందుబాటులో వస్తుందని, నేరుగా మెదడు నుంచి మెదడు మధ్య సంభాషణ జరుగుతుందన్నారు. ఈ ఆవిష్కరణ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని బాగా వంగా పేర్కొన్నారు. టెలీపతితో పాటు నానోటెక్నాలజీలో పురోగతి సాధిస్తారని తెలిపారు. అయితే టెక్నాలజీని దుర్వినియోగం చేస్తే దుష్పరిణామాలు తప్పవని హెచ్చరించారు. ‘రోజువారీ జీవితంలో కృత్రిమ మేధ భాగమవుతుంది.. ఆరోగ్య సంరక్షణ, విద్య, పరిపాలన రంగాల్లో ఏఐ వినియోగం పెరుగుతుంది’ అని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com