ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఆహారాలు తింటే గుండె ధమనులు మూసుకుపోతాయి

Health beauty |  Suryaa Desk  | Published : Tue, Dec 17, 2024, 10:43 PM

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అయితే, అలాంటి ఆరోగ్యాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. ప్రస్తుత జనరేషన్‌లో చాలా మంది లైఫ్ స్టైల్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టడం లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో ఎలా పడితే అలా బతికేస్తున్నారు. టైమ్‌కి తినకపోవడం, ఏది పడితే అది తినడం, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలా ఓ పద్ధతి లేకుండా జీవిస్తున్నారు. దీంతో.. అనారోగ్యాల బారిన పడుతున్నారు. అందులో మొత్తం ప్రపంచాన్ని భయెపడుతున్న ఒక వ్యాధి ఉంది. అదే గుండెపోటు. ఈ రోజుల్లో చాలా మంది గుండె పోటుతో ఆకస్మాత్తుగా చనిపోతున్నారు. యువత కూడా గుండె పోటు బారిన పడుతున్నారు. అంతేకాకుండా గుండె సమస్యలు వస్తున్నాయి.


గుండె జబ్బులకు చెక్ పెట్టాలంటే మన జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏది పడితే అది తినకూడదు. ముఖ్యంగా రాత్రి నిద్రపోయే ముందు చేసే డిన్నర్ విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదంటున్నారు నిపుణులు. రాత్రి తినే ఆహారాలు చాలా వరకు గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. తినే ఆహారం నుంచి చేసే పనుల వరకు కొన్ని మార్పులు చేసుకుంటేనే గుండె బలంగా ఉంటుంది. లేదంటే మహమ్మారి బారిన పడక తప్పదు. రాత్రి పూట కొన్ని ఆహారాలకు జోలికి పోకూదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ ఫుడ్స్ తింటే గుండెకు ప్రమాదమంటున్నారు. ఇంతకీ ఆ ఫుడ్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.


 ఉప్పు ఎక్కువగా తినకండి..


​చాలా మంది ఆహారంలో ఉప్పు ఎక్కువగా తింటారు. అయితే, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. పిజ్జా, చిప్స్, నామ్‌కీన్, ప్రాసెస్ చేసిన మాంసం వంటి వాటిలో ఉప్పు ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. అందుకే రాత్రి పూట భోజనంలో ఇలాంటి ఫుడ్స్ తినడం మానుకోవాలి. పప్పులు, బియ్యం లేదా రోటీ, కూరగాయలతో ఇంట్లో చేసిన వంటకాల్నే తినడం అలవాటు చేసుకోండి. కూరల్లో కూడా ఉప్పు మోతాదును తగ్గించుకోండి.


స్పైసీ ఫుడ్స్ చాలా డేంజర్..


స్పైసీ ఫుడ్స్ (కారం ఎక్కువగా ఉన్న ఆహారాలు) గట్ ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. ఇవి ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా రాత్రిపూట తింటే కడుపు ఉబ్బరం, అజీర్ణం, అసిడిటీ, గుండెల్లో మంట వంటి సమస్యలను కలిగిస్తాయి. ఎందుకంటే రాత్రిపూట అలాంటి ఆహారాన్ని జీర్ణం చేయడం గట్ ఎంజైమ్‌లకు చాలా కష్టమైన పని. అందుకే మసాల ఆహారాలకు, స్పైసీ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి పూట స్పైసీ ఫుడ్ తినడం గుండె ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదని ఎక్సపర్ట్స్ చెబుతున్నారు. ఇలాంటి ఫుడ్స్ గుండెపై ఒత్తిడిని పెంచుతాయి. స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల రాత్రి పూట నిద్రకు కూడా భంగం కలిగే అవకాశం ఉంది.


వేయించిన ఆహారాలు..


చాలా మంది రాత్రి సమయాల్లో డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తింటుంటారు. ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ చికెన్, నూడిల్స్ వంటి వాటిని ఓ పట్టు పడుతుంటారు. వీటితో కచోరి, సమోసా, బజ్జీలు, పకోడాలు వంటివి తింటుంటారు. అయితే, వీటిలో అధిక మొత్తంలో సంతృప్త కొవ్వులు ఉంటాయి. వీటిని తినడం వల్ల గుండె ధమనులు మూసుకుపోతాయి. దీంతో.. గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది.


స్వీట్స్..


చాలా మంది రాత్రి పూట డిన్నర్ తర్వాత.. స్వీట్స్ లేదా చాక్లెట్ తింటుంటారు. అయితే, ఇది ఎంత మాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఇలా చేయడం రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయని హెచ్చరిస్తున్నారు. దీంతో.. రాత్రి నిద్రిస్తున్నప్పుడు ఎటువంటి ఉపయోగం లేని అదనపు శక్తి ఉత్పత్తి అవుతుంది. దీంతో.. కొవ్వు బర్న్ కాదు. దీంతో.. బరువు పెరిగే ప్రమాదముంది. అధిక బరువు ఉన్నవారికి గుండె సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటుది. అందుకే రాత్రి వేళల్లో స్వీట్స్, చాక్లెట్ వంటి పదార్థాల జోలికి పోకూడదంటున్నారు నిపుణులు. వీటి బదులు ఓ ముక్క బెల్లం తింటే మంచిదంటున్నారు నిపుణులు.


పిండి పదార్థాలు..


ఎక్కువ పిండిపదార్థాలు ఉన్న ఆహారాల్ని రాత్రి వేళల్లో తీసుకోకూడదు. బంగాళదుంపలు, పరోటాలు వంటి పదార్థాల జోలికి పోకూడదు. వీటి వల్ల కూడా చక్కెర, ఇన్సులిన్ స్పైక్‌లు ఏర్పడతాయి. ఎందుకంటే పిండి పదార్థాలు చక్కెరగా జీవక్రియ చేయబడి శక్తి కోసం బర్న్ అవుతాయి. దీంతో చివరికి బరువు పెరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక బరువు ఉన్నవారికి గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఇలాంటి ఆహారాలు రాత్రి పూట అవాయిడ్ చేస్తే చాలా మంచిది.


ఈ పనులు కూడా ముఖ్యం..


మంచి ఆహారం తినడంతో పాటు కొన్ని పనుల్ని మీ దినచర్యలో భాగం చేసుకుంటేనే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కూర్చోని పనిచేసే వాళ్లే ఎక్కువగా గుండె పోటు సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారు కొన్ని చిన్నపాటి వ్యాయామాలు చేస్తే సరిపోతుంది. వాకింగ్, జాగింగ్, చిన్నపాటి నడక, సైక్లింగ్ వంటి పనులు మీ దినచర్యలో భాగం చేసుకోవాలి. బయటికి వెళ్లి వ్యాయామం చేయలేని వారికి యోగా, మెడిటేషన్ వంటి వ్యాయామాలు బాగా ఉపయోగపడతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com