విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ అట్టర్ ఫ్లాప్ అయ్యారని వైయస్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ప్రెసిడెంట్ రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హాఫ్ ఇయర్లీ పరీక్షలు కూడా సమర్థవంతంగా నిర్వహించలేని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని, పరీక్ష ప్రారంభమైన గంటలో గణిత ప్రశ్నాపత్రం ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైన ఘటన విద్యార్థుల భవిష్యత్తు పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదనే విషయాన్ని తేటతెల్లం చేస్తోందని ఆయన ఆక్షేపించారు. సీల్డ్ కవర్‌లో రావాల్సిన ప్రశ్నాపత్రాలు లీకై యూట్యూబ్‌లో దర్శనమిచ్చాయంటే రాష్ట్రంలో విద్యా విధానం ఎంత లోపభూయిస్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చని మండిపడ్డారు.