చంద్రబాబు సీఎంగా 2014-19 మధ్యలో అధికారాన్ని దుర్వినియోగం చేసి కోట్లాధి రూపాయల ప్రజాధనంను కొల్లగొట్టిన వైనంపై నమోదైన అవినీతి కేసులను ఈ రాష్ట్రం వెలుపల విచారణ జరిగితేనే న్యాయం జరుగుతుందని మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ నెల్లూరు పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ..సీఎం హోదాలో తనపైన గతంలో నమోదైన అవినీతి కేసులను నిర్వీర్యం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. గతంలో ఈ కేసులను నిస్పక్షపాతంగా విచారించి, వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చిన అధికారులపై నేడు సీఎంగా చంద్రబాబు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు.