కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ ఖండించారు.
ఈ సందర్భంగా గురువారం పార్టీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని లేదా కేంద్ర ప్రభుత్వం నుండి ప్రధానమంత్రి బర్తరఫ్ చేయాలని నిరసన వ్యక్తం చేశారు.