సరసమైన ధరలకు నిత్యావసర సరుకులను వినియోగదారులకు అందించేందుకు ప్రతి మండలంలో ప్రత్యేక కేంద్రo ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ కె. కార్తీక్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
శుక్రవారం నెల్లూరు కలెక్టరేట్లోని ఎస్ ఆర్ శంకరన్ హాల్లో జిల్లా స్థాయి ధరల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. రైతు బజార్లలో పామాయిల్ ప్యాకెట్ ను 110/- లకే వినియోగదారులకు అందించాలన్నారు.