మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పై శ్రీకాళహస్తీశ్వరాలయ ఈవో బాపిరెడ్డి గురువారం వివిధ శాఖల అధికారులతో పరిపాలన భవనంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 6 వరకు జరిగే శ్రీకాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాలు సందర్భంగా భక్తులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలన్నారు. అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.