కైకలూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు అభివృద్ధి కమిటీ సమావేశం గురువారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, మాజీ శాసనమండలి సభ్యులు కమ్మిలి విఠల్ రావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కామినేని మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించటమే ప్రభుత్వం లక్ష్యమని అందుకే ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రతి వైద్యానికి 24 గంటలు సేవలు అందిస్తున్నారన్నారు.