రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో తెల్లవారుజామున ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడి అజ్మీర్ రోడ్డులో సీఎన్‌జీ గ్యాస్ నింపిన ట్యాంకర్ ఒక్కసారిగా పేలిపోయింది.దీంతో అందులో భారీగా మంటలు చెలరేగాయి. ఐతే.. ట్యాంకర్‌లో పేలుడు సంభవించిన ఘటన పెట్రోల్ బంకుకి దగ్గర్లో జరిగింది. ఆ చుట్టుపక్కల ఉన్న చాలా వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. కొద్దిసేపటికే మంటలు భారీగా పెరిగాయి. ఈ ప్రమాదంలో నలుగురు చనిపోగా, మరికొంత మంది గాయపడినట్లు తెలుస్తోంది.అక్కడ తీవ్ర గందరగోళం ఉంది. ఈ ప్రమాదంలో కొంతమంది మంటల్లో చిక్కుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది 20కి పైగా ఫైరింజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.