అభివృద్ధి కార్యక్రమాలను అడ్డు కుంటే అధికారులైనా సహించేదిలే దని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బెందా ళం అశోక్ హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా, కవిటి ఎంపీడీవో కార్యాలయంలో గురువారం మండల స్థాయి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఉపా ధి హామీ పథకంపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో రోడ్లు నిర్మా ణం చేపట్టడం జరుగుతుందన్నారు. గ్రామాల నుంచి బీచ్‌వరకు రోడ్లు నిర్మాణం చేస్తుంటే ఫారెస్ట్ అధికారులు అడ్డుకోవడం తగదన్నారు. సమావే శానికి వచ్చిన ఫారెస్ట్ సెక్షన్ అధికారి రాఘవయ్యను ఈ సందర్భంగా ఎమ్మె ల్యే ప్రశ్నించారు. అభ్యంతరాలు ఉంటే కలెక్టర్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానే తప్పా గ్రామాల్లో పనులు అడ్డుకోవడం తగదన్నారు. అలాగే వ్యవసాయ శాఖపై జరిగిన సమీక్షలో వాతావరణ పరిస్థితులపై రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. మండల ప్రత్యేకాధి కారి అప్పలస్వామి, తహసీల్దార్ ము రళీమోహన్‌రావు, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.