ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమిత్‌షాను తక్షణమే పదవి నుండి తొలిగించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 20, 2024, 02:28 PM

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను తక్షణమే బర్తరఫ్‌ చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌లో అంబేడ్కర్‌ను అవమానిస్తూ అమిత్‌షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అరసవల్లి నగరంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ప్రజా సంఘాల నాయకులు గురువారం నిరసన తెలిపారు. తొలుత అంబేడ్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జి.సింహాచలం, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, రైతు సంఘం కార్యదర్శి కె.మోహన రావు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి గొంటి గిరిధర్‌, ఉపాధ్యక్షుడు కె.అప్పారావు, ఐద్వా జిల్లా కన్వీనర్‌ అల్లా డ లక్ష్మి, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ కె.నాగమణి తదితరులు పాల్గొన్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యలను నిరసిస్తూ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు స్థానిక పీఎస్‌ఎన్‌ఎం మిల్లు జంక్షన్‌లో నిరసన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రెల్ల సురేష్‌, కేవీఎల్‌ఎస్‌ ఈశ్వరి, అంబటి దాలినాయుడు, కొత్తపల్లి రాంప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com