భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను అవమానించిన కేంద్ర మంత్రి అమితషాను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కర్నూలు సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్ డిమాండ్ చేశారు. గురువారం కొత్తబస్టాండు సుందరయ్య కూడలిలో నిరసన తెలిపి అమితషా ఫొటోలను దహనం చేశారు. ఈ సందర్భంగా గౌస్‌దేశాయ్ మాట్లాడుతూ రాజ్యాంగానికి సంబంధించిన చర్చ జరుగుతున్న క్రమంలో అంబేడ్కర్ పేరును స్మరించే బదులు దేవుని పేరు స్మరిస్తే ఏడుసార్లు స్వర్గానికి వెళ్లిరావచ్చని అమితషా చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అమితషాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నగర కార్యదర్శి టి.రాముడు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్.రాధాక్రిష్ణ, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఆనంద్‌బాబు, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాఘవేంద్ర, నగేష్ పాల్గొన్నారు.