కర్నూలు జిల్లా, ఆత్మకూరు మండలంలోని ఇందిరేశ్వరం గ్రామంలో ఈ నెల 16వ తేదిన క్షణికావేశంలో బామ్మర్దిని హత్య చేసిన బావను పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అర్బన్ సీఐ రాము నిందితుడిని గురువారం మీడియా ఎదుట హాజరు పరిచారు. ఇందిరేశ్వరం గ్రామానికి చెందిన షేక్ అర్షత్ వలి(32), శ్రీపతిరావుపేట గ్రామానికి చెందిన తన మేనత్త కొడుకు షేక్ షఫి గొర్రెలను మేపేవారు. వారం రోజులుగా షేక్ షఫి అతడి తమ్ముడు ముర్తుజాలు, అర్షత్‌వలి, పెద్దతిరుమలయ్య వేరువేరుగా తమ గొర్రెలను మేపుకొనేవారు. ఈ నెల 16వ తేదిన రాత్రి గొర్రెలను వేరువేరు పొలాల్లో ఉంచి కలిసి ఒక చోట చలిమంట వేసుకుని మాట్లాడుకుంటున్నారు.
అయితే గొర్రెలను వేరువేరుగా మేపడంపై మద్యం మత్తులో ఉన్న అర్షత్‌అలి, షఫి మధ్య ఘర్షణ జరిగింది. ఈక్రమంలో అర్షత్ అలి చలిమంటలోని ఓ నిప్పు కర్రతో షేక్ షఫిని కొట్టాడు. దీంతో కోపోద్రిక్తుడైన షఫి అక్కడే ఉన్న గొడ్డలితో అర్షత్ తలపై బలంగా దాడి చేశాడు. దీంతో అర్షత్ గట్టిగా కేకలు వేయగా షేక్ షఫి అక్కడి నుంచి పరారయ్యాడు. సమీపంలో ఉన్న గొర్రెల కాపర్లు గాయపడిన అర్షత్‌ను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అర్షత్ వలి భార్య నసిమూన్ ఫిర్యాదు మేరకు ఈ నెల 17న కేసు నమోదు చేసుకున్న పోలీసులు షేక్ షఫిని బుధవారం సాయంత్రం ఆత్మకూరులోని నంద్యాల టర్నింగ్ వద్ద అరెస్టు చేశారు. గురు వారం షేక్ షఫిని కోర్టులో హాజరు పర్చగా మెసిస్ర్టేట్ రిమాండ్‌కు ఆదేశించినట్లు సీఐ రాము వెల్లడించారు. ఎస్‌ఐలు నారాయణరెడ్డి, హుసేన్‌బాషా, ఏఎస్‌ఐ శంకరరెడ్డి, సంజీవుడు, కానిస్టేబుళ్లు లక్ష్మణరావు, మౌలాలి, మదర్ సాహెబ్, రవి, శివరామ్, రాజశేఖర్, స్వర్ణ ఉన్నారు.