రాజధాని నిర్మాణానికి మొత్తం 31 వేల కోట్లు రూపాయలు సిద్ధంగా ఉన్నాయని సీఎం చెప్పారు. ప్రపంచ బ్యాంక్ నుంచి 15 వేల కోట్లు, హడ్కో నుంచి రూ. 16 వేల కోట్లు మంజూరు అయ్యాయని అధికారులు చెప్పారు. ప్రపంచ బ్యాంక్ ఈరోజు ఆమోదం తెలుపుతుందని భావిస్తున్నామని వారు అన్నారు. మూడు ఏళ్లలో రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని సీఎంకు అధికారులు తెలియజేశారు. అసెంబ్లీ నిర్మాణంపై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. మంత్రులు కొంతమంది వెళ్లి కొన్ని అసెంబ్లీ భవనాలు లోపల ఎలా ఉన్నాయి అనేది చూడాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. రాజధాని నిర్మాణ పనులు 30 రోజుల్లో ప్రారంభం అవుతాయని ఈ సందర్భంగా అధికారులు పేర్కొన్నారు.