ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్ (ఆయా) వర్కర్లకు ఐదు నెలలుగా పెండింగ్‌లో వున్న వేతనాలు వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం డీఈవో ఎం.సుబ్బారావుకు సీఐటీయూ నాయకులు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.మహేష్, జిల్లా నాయకుడు ఎం.సోమేశ్వరరావు మాట్లాడుతూ శానిటేషన్ వర్కర్లకు దాదాపుగా ఐదు నెలల నుంచి వేతనాలు పెండింగ్‌లో వున్నాయన్నారు. పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.