మచిలీపట్నం నగరాల్లో విషాదం నెలకొంది. తన కుమార్తె చనిపోయిందన్న బాధతో రాజుపేటకు చెందిన ముఠా కూలీ కేసన జాను(21) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం విషం తాగాడు. పెళ్లయిన కొద్దికాలనికే మృతిచెందడంతో అతని భార్య కల్యాణి కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. జాన్ ఆత్మహత్యకు ఐదు నెలల కుమార్తె మృతిచెందడంతో పాటు కుటుంబ కలహాలే కారణమని పోలీసులు తెలిపారు. భార్య కల్యాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇనకుదురు సీఐ పరమేశ్వర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. దర్యాప్తు చేస్తున్నారు.