అల్పపీడనం కారణంగా వాతావరణంలో మార్పులు రావడం, రెండు రోజుల నుంచి ఆకాశం మేఘావృతమై ఉండడం, ఈదురుగాలులు వీచడంతో రైతుల కంటిమీద కునుకు లేకుండా పోతోంది. వరి పంట కోసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. కృష్ణా జిల్లా, నాగాయలంక మండలంలో 15 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. 6 వేల ఎకరాల్లో కోతలు కోశారు. 2 వేల ఎకరాల్లో కుప్పలు వేశారు. 4 వేల ఎకరాల్లో కోసిన వరి పంట పనలపైన ఉంది.
వాతావరణం మేఘావృతమై ఉండటంతో పనలు తేమగా ఉన్నాయి. పనలు ఆరకుండానే కుప్పలు వేస్తే ధాన్యం, వరిగడ్డి పాడైపోతాయని రైతులు అంటున్నారు. పనలు ఆరబెట్టుకున్న కొందరు రైతులు ఎక్కువ కూలీ ఇచ్చి హడావుడిగా కుప్పలు వేయిస్తున్నారు. వ్యవసాయాధికారులు సూచనలు పాటించి కొందరు కోతలు వాయిదా వేశారు. యం త్రాలతో కోసిన పంటను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.