ఏపీలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విజయవాడలో టూరిజం రంగంలో పెట్టుబడులు పెట్టే వారందరితో ఒక సదస్సు నిర్వహించామని మంత్రి చెప్పారు. విశాఖ పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి చాలా మంది ముందుకు వస్తున్నారని పేర్కొన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యాటక శాఖ నిర్వహించే ఉత్సవాల తేదీలను ప్రకటిస్తామన్నారు.