ఉంగుటూరు జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం పలువురు బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే ధర్మరాజు అందించారు. మొత్తం 12 మంది లబ్ధిదారులకు సుమారు.
ఎనిమిది లక్షల 39 వేల రూపాయలు మంజూరైనట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. నిష్పక్షపాతంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి నిధులు వచ్చే విధంగా కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు.