ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చలికాలంలో కొబ్బరి నూనెను ఇలా వాడితే.. ముఖంపై ముడతలు, మొటిమలు మాయమై యవ్వనంగా మారిపోతారు..

Health beauty |  Suryaa Desk  | Published : Fri, Dec 20, 2024, 10:50 PM

చలికాలంలో చాలా మంది భయపెడతారు. ఆరోగ్య సమస్యల్ని పక్కన పెడితే.. చాలా మంది చర్మ సంబంధిత సమస్యలతో బాధపడతారు. ఈ సీజన్‌లో వీచే చలి, పొడి గాలుల వల్ల చర్మం పొడిబారడం, నిర్జీవంగా కనిపిస్తుంది. అంతేకాకుండా చర్మం, పెదవులు పగిలిపోతుంటాయి. అందుకే చలికాలంలో చర్మ సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే.. చర్మం పగిలిపోతుంది. స్కిన్ కేర్ కోసం మార్కెట్‌లో అనేక రకాల చర్మ సంరక్షణ ప్రొడక్ట్ అందుబాటులో ఉన్నాయి. అయితే, వీటిని అతిగా వాడటం వల్ల దుష్ప్రభావాలు కలిగే ప్రమాదముంది. ఈ ప్రొడక్ట్స్‌లో కఠినమైన రసాయనాలు ఉంటాయి. దీంతో.. చర్మం ఆరోగ్యం దెబ్బతినవచ్చు.


అందుకే రసాయన ప్రొడక్ట్స్‌కు దూరంగా ఉండాలి. ఇంటి చిట్కాల ద్వారా అందాన్ని కాపాడుకోవచ్చు. జుట్టు సంరక్షణలో కీలక పాత్ర పోషించే కొబ్బరి నూనె అందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. కొబ్బరి నూనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని చలిగాలుల నుంచి రక్షిస్తాయి. అంతేకాకుండా కొబ్బరి నూనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు కూడా ఉన్నాయి. దీంతో చర్మం పొడిబారకుండా ఉంటుంది. కొబ్బరి నూనె వల్ల చర్మానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో, ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.


​కొబ్బరి నూనెలో మాయిశ్చరైజింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇది చర్మానికి కావాల్సినంత తేమనందిస్తుంది. చలికాలంలో వచ్చే పొడి చర్మం, చికాకు నుంచి ఉపశమనం ఇస్తుంది. కొబ్బరి నూనెలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు, యాంటీమైక్రోబయల్ గుణాలు.. వాపు, దురద, మంట వంటి లక్షణాలన్ని తగ్గిస్తాయి. చర్మ కణాల్లోకి తేమను లోతుగా నడిపించే సామర్థ్యం ఉంది. ఇది చర్మాన్ని హైడ్రేట్‌గా, మృదువుగా మారుస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే విటమిన్ ఇ, లినోలెయిక్ యాసిడ్, క్యాప్రిలిక్ యాసిడ్ చర్మానికి పోషణ అందిస్తాయి.


యాంటీమైక్రోబయల్ లక్షణాలు..


కొబ్బరి నూనెలో యాంటీ మైక్రోబయల్ గుణాలు ఉన్నాయి. దీనిలోని లారిక్ యాసిడ్‌, క్యాప్రిలిక్ యాసిడ్ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్‌, యాంటీవైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి బ్యాక్టీరియా, ఫంగస్‌ వల్ల కలిగే ఇన్ఫెక్షన్ల నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. మొటిమలు, తామర, సోరియాసిస్, స్కిన్‌ ఇన్ఫెక్షన్ల నుంచి కొబ్బరి నూనె రక్షిస్తుంది.


మంట లేదా ఇన్ఫ్లమేషన్‌కు చెక్..


కొబ్బరి నూనెలో ఉండే మీడియం చైన్ ట్రైగ్లిజరాయిడ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల్ని కలిగి ఉంటాయి. ఇవి చర్మంపై దద్దుర్లు, మంట వంటి సమస్యల్ని తగ్గిస్తాయి. కొబ్బరి నూనెలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, ఫంగల్, వైరల్ లక్షణాలు.. చర్మంపై మచ్చలు, ఇన్ఫెక్షన్లను నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.


మొటిమలకు చెక్..


ఈ రోజుల్లో చాలా మంది మొటిమల సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి కొబ్బరి నూనె చక్కటి పరిష్కారం. ఇందులో లారిక్ యాసిడ్ ఉంటుంది. అంతేకాకుండా యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇవి మొటిమలతో పాటు ముఖంపై ఎరుపు, వాపుని తగ్గిస్తాయి. స్కిన్ బ్రేక్‌వుట్‌లకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపుతాయి.


వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు..


కొబ్బరి నూనె మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. దుమ్ము కణాలు, కాలుష్యం నుంచి చర్మాన్ని రక్షిస్తుంది. కొబ్బరి నూనెను అప్లై చేయడం వల్ల సూర్య కిరణాల నుంచి రక్షణ కలుగుతుంది. చిన్న వయసులోనే ముడతలు, మచ్చలు, ఫైన్ లైన్ల్ వంటి వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి. కొబ్బరి నూనెలో ఉండే విటమిన్ E యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.


కొబ్బరి నూనెను ఎలా అప్లై చేయాలి?


కొబ్బరి నూనె అప్లై చేసే ముందు ముఖాన్ని క్లీన్ చేసుకోండి. ఆ తర్వాత పొడి టవల్‌తో ముఖాన్ని తుడుచుకోండి. ముఖం ఆరిన తర్వాత కొద్దిగా కొబ్బరి నూనెను అప్లై చేయండి. ఆ తర్వాత సున్నితంగా మసాజ్ చేయండి. ఇలా చేసిన తర్వాత కొంచెం సేపు ఆరనివ్వాలి. 20 నుంచి 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత పొడి టవల్‌తో తుడవండి. ఇలా రోజూ చేయడం వల్ల చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉంటుంది. మీ అందం రెట్టింపు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa