బనగానపల్లె మండలం నందవరం గ్రామం శ్రీ చౌడేశ్వరి దేవాలయంలో మంగళవారం నుంచి చండీయాగం నిర్వహిస్తున్నట్లు వేద పండితులు పవన్ కుమార్ శర్మ, ఈఓ కామేశ్వరమ్మ సోమవారం తెలిపారు. చౌడేశ్వరి మాత దీక్ష విరమణ సందర్భంగా రేపటి నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ చండీయాగంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి హాజరవుతారని తెలిపారు.