అనకాపల్లి జిల్లా, పరవాడ ఫార్మా సిటీలో మరోసారి విష వాయువులు లీక్ అయ్యాయి. రక్షిత డ్రగ్స్ నుంచి విష వాయువులు విడుదల అయ్యాయి. ఒక్కసారిగా వాయువులు విడుదల కావడంతో ఇద్దరు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన కార్మికులు, కంపెనీ యాజమాన్యం బాధితులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.