రంగస్థల కళాకారులకు తమవంతు సహాయ సహకారాలు అందజేస్తామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో, విద్వాన పత్తి ఓబులయ్య రాసిన ‘జగదేక సుందరి సామా’ పద్యనాటక పుస్తక ఆవిష్కరణ, నాటక ప్రదర్శన జరిగింది. కార్యక్రమంలో ఏపీ నాటక అకాడమీ చైర్మన గుమ్మడి గోపాలకృష్ణ, ఆధ్యాత్మికవేత్త బీవీ రెడ్డి, నాటక రచయిత పత్తి ఓబులయ్య, మూల కథా రచయిత ఎస్‌డీవీ అజీజ్ పాల్గొన్నారు.
కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి ఏపీ నాటక అకాడమీ ఛైర్మన గుమ్మడి గోపాలకృష్ణను ఘనంగా సత్కరించారు. సామాగా హైదరాబాదుకు చెందిన ప్రముఖ కళాకారిణి సురభి ప్రభావతి, సజ్జికగా తిరుపతికి చెందిన ప్రముఖ కళాకారిణి హసీనా ఎస్‌కే నటించి మెప్పించారు. ఇందులో మాఘ పాత్రలో జీవీ శ్రీనివాసరెడ్డి, భద్రగా వి.రాముడు, ఆర్ముగం పిళ్లేగా సంగా ఆంజనే యులు, పోతురాజుగా ఎస్ మహ్మద్ మియా, పుణ్ణకుడిగా పి. రాజారత్నం, ప్రసేనుడిగా కె. బాలవెంకటేశ్వర్లు, భద్రుడిగా గాండ్ల లక్ష్మన్న నటించారు. సంగీతం ఇ. పాండురంగయ్య అందించిన ఈ నాటకానికి కీబోర్డు ప్లేయర్‌గా రాజబాబు వ్యవహరించారు.