ప్రకాశం జిల్లాలో వస్తున్నా భూప్రకంపనలపై జిల్లా కలెక్టర్‌తో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయస్వాములు మాట్లాడారు. నిన్న (ఆదివారం) కలెక్టర్‌కు ఫోన్ చేసిన మంత్రులు వివరాలు ఆరా తీశారు. తరచుగా ఆ ప్రాంతంలో ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయో డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తలతోనూ చర్చించి పూర్తిగా సమాచారం సేకరించాలని చెప్పారు. భూ ప్రకంపనలపై సమగ్ర నివేదిక తయారు చేసి అందించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. జిల్లా వాసులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని మంత్రులు చెప్పారు.