చంద్రబాబు ఏపీకి సీఎం. ఆయన సీఎం గా ఉన్నా లేక అపొజిషన్ లీడర్ గా ఉన్నా కూడా ఆయనకు భారీ భద్రత ఉంటుంది. చంద్రబాబు విషయంలో మొదటి నుంచి భారీ భద్రత ఉంటోంది. ఆయనకు స్పెషల్ సెక్యూరిటీ కల్పిస్తారు. రెండు దశాబ్దాల క్రితం అలిపిరిలో బాబు మీద జరిగిన దాడితో ఆయనకు సెక్యూరిటీని టైట్ చేశారు. అయితే బాబు ఇపుడు ఊహించని విధంగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.సీఎం గా ఉంటూ ఆయన తన భద్రతను తగ్గించుకున్నారు నిజానికి బాబుకు ఈ సమయంలో కావాల్సినంత భద్రత కోరవచ్చు. తీసుకోవచ్చు. కానీ బాబు మాత్రం సెక్యూరిటీని దాదాపుగా కుదించేసుకున్నారు. ఇలా ఎందుకు అంటే జనాలకు మరింత చేరువ కావడానికే అని అంటున్నారు. ఆయన నాలుగవ సారి ఏపీకి సీఎం అయ్యారు. అపుడే ఆయన చెప్పారు. తన వద్దకు వచ్చే ప్రజలను భద్రత పేరుతో ఇబ్బంది పెట్టవద్దని ఆయన కోరారు కూడా. తనకు పరదాలు తెర చాటులూ వద్దని కూడా కరాఖండీగా చెబుతున్నారు. అదే విధంగా ఒక సీఎం వస్తున్నారు అంటే దాని కంటే ముందు ట్రాఫిక్ ని ఆపేస్తారు. అలా కూడా చేయవద్దని బాబు ఆదేశాలను జారీ చేశారు. ఇదంతా ఎందుకు అంటే అటు పార్టీ కేడర్ కి ఇటు జనాలకు బాగా దగ్గర కావడానికే అని అంటున్నారు అందుకే ఆయన తనకు బాగా భద్రత తగ్గించమని కోరుకుంటున్నారు. అయితే బాబు ఎంత వద్దు అంటున్న ప్రోటోకాల్ అన్నది ఒకటి ఉంటుంది. అందువల్ల భద్రత ఒక సీఎం స్థాయి వ్యక్తికి తప్పనిసరిగా ఉండాల్సిందే అని అంటున్నారు. మరో వైపు చూస్తే దీనికి ఏమిటి పరిష్కారం అని ఆలోచించిన మీదట చంద్రబాబు ఫిజికల్ గా తనకు భద్రత తగ్గిస్తూ టెక్నికల్ గా వాడుకోవాలని నిఘా విభాగానికి సెక్యూరిటీ విభాగానికి ఆదేశించారు అని అంటున్నారు. అంటే బాబుకు భద్రత ఉంటుంది. కానీ అది టెక్నికల్ గా ఎక్కువగ ఉంటుంది. భౌతికంగా చూస్తే బాబు చుట్టూ ఉండే వారిని తగ్గించేస్తారు. అలా బాబు ఫ్రీగా కనిపిస్తారు. కానీ బాబు ఇంటి వద్ద అటానమస్ డ్రోన్ల సాయంతో నిరంతరం ఆయన భద్రతను పర్యవేక్షిస్తూనే ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల టెక్నాలజీని ఉపయోగించుకుని బాబు భద్రతను మరింత గట్టిగానే చేస్తున్నారు అని చెప్పాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే చంద్రబాబు నివాసం ఉంటున్న ఉండవల్లిలోని నివాసంలో అత్యాధునిక డ్రోన్‌ను పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేసింది. ఇక బాబు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన ఈ డ్రోన్ అటానమస్ విధానంలో ఆటోపైలట్‌గా సమయానికి అనుగుణంగా ఎగురుతుంది. మళ్లీ దానికదే డక్‌పై ల్యాండ్ కాగానే ఛార్జింగ్ అవుతుంది. ఈ డ్రోన్ పంపే డేటాను పరిశీలిస్తూ సెక్యూరిటీ అధికారులు ఇంటి పరిసరాల్లో సెక్యూరిటీని ఎప్పటికపుడు పర్యవేక్షిస్తూంటారు. ఇక ఈ డ్రోన్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది అంటే ఎవరైనా అనుమానస్పదంగా ఉంటే ఈ డ్రోన్ల ద్వారా చూసి పర్యవేక్షణ టీం కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలా బాబు ఇంటి వద్ద ప్రస్తుతం ఉన్న భద్రత కంటే కూడా టెక్నాలజీ భద్రతతోనే మరింత గట్టిగానే ఉంటుంది అని అంటున్నారు అదే సమయంలో కార్యకర్తలు కానీ ప్రజలు కానీ కలిసేందుకు వీలు ఉంటుంది అని అంటున్నరు. ఎంతైనా విజనరీ కదా. అందుకే బాబు ఈ విధంగా డెసిషన్ తీసుకున్నారు అని అంటున్నారు.