భారతదేశ అభివృద్ధిలో రైతులు కీలకపాత్ర పోషిస్తున్నారని రాజానగరం పరిధి, కలవచర్లలోని కృషి విజ్ఞాన కేంద్రం హెడ్ వీఎస్‌జీఆర్ నాయుడు పేర్కొ న్నారు. కలవచర్ల కేవీకేలో సోమవారం జాతీ య రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.దేశ శ్రేయస్సుకు రైతులు పునాది అన్నారు. రైతులను ప్రతి ఒక్కరూ గౌర వంగా చూడాలన్నారు.ఉద్యాన పంటల అధి కారి జేవిఆర్ సత్యవాణి వ్యవసాయ శాస్త్ర వేత్తల సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.రైతుల శ్రమ దేశాన్ని పోషి స్తుందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్ధను నిలబెడు తుందన్నారు.ఇది ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టు కోవాలన్నారు. అన్నం పెట్టే రైతన్న లేకపోతే ఆకలలి తీరదన్నారు. అన్నదాత ఆరుగాలం కష్టపడి తేనే మన కడుపు నిండుతుందని తెలిపారు.రైతు కుటుంబంలో పుట్టడం ఈ ప్రాంత యువత చేసుకున్న అదృష్టమన్నారు.
రైతు సేవకు గుర్తింపుగా చల్లా నాగన్న అనే అభ్యు దయ రైతును సత్కరించారు.ఈ సందర్భంగా హాజరైన రైతులకు కృషి విజ్ఞాన కేంద్రంలో నువ్వుల పంట సాగుపై శిక్షణ ఇచ్చారు. ప్రత్యామ్నాయ పంటలే లాభదాయకంగా ఉం టాయన్నారు.రాజానగరంలోని దివ్య విద్యా సం స్థల ఆధ్వర్యంలో డిగ్రీ కళాశాల విద్యా ర్థులు క్షేత్ర ప్రదర్శన చేశారు.ఈ కార్యక్రమంలో గృహ విజ్ఞాన విభాగం అధికారి సంజయ్ హెగ్డే, చేపల విభాగాధికారి రవీంద్ర పొంటెక్కే, కేవీకే పశుసంవర్థక అధికారి బి.నాగేశ్వరరెడ్డి, సస్య రక్షణ అధికారి రఘునందన్, జిల్లా వ్యాప్తంగా మండలాల నుంచి రైతులు హాజరయ్యారు.