స్వీట్ పొటాటోలో పిండిపదార్ధాలతోపాటు చక్కెర కూడా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు కూడా చిలగడ దుంపలు తినొచ్చు. ఇవి రక్తంలో గ్లూకోజ్ లెవల్స్‌ను పెంచవు.అలాగే ఇవి హార్ట్ బీట్‌ను కంట్రోల్ చేసి గుండె ఆరోగ్యా్న్ని మెరుగుపరుస్తాయి. వీటిని తినడం ద్వారా బిపీని అదుపులో ఉంచుకోవచ్చు.స్వీట్ పొటాటోలో కార్బో్హైడ్రేట్స్‌తో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. దీనివల్ల జీర్ణశాయం ఆరోగ్యంగా ఉంటుంది. ఎసిడిటీ, అల్సర్లు తగ్గుతాయి. ఈ దుంపలు తినడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. వృద్ధాప్య లక్షణాలు దరిచేరకుండా కాపాడతాయి.స్వీట్ పొటాటోలో తినడం ద్వారా మూత్రపిండాల సమస్యలు, ఎముకల సమస్యలు, కండరాల నొప్పులు లాంటివి తగ్గుతాయి. స్వీట్ పొటాటోలోని యాంటీఆక్సిడెంట్లు.. కాన్సర్ కణాలతో పోరాడగలవని పరిశోధనల్లో తేలింది. కొన్ని రకాల క్యాన్సర్ కణాలు త్వరగా పెరగకుండా ఇవి నెమ్మదించేలా చేస్తాయి.
మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. తరచూ తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అంతేకాదు..క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులు దరిచేరకుండా రక్షిస్తుంది. ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.మలబద్ధకాన్ని నివారిస్తుంది. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. స్వీట్ పొటాటో తొక్కతో సహా తినాలి. తియ్యగా ఉండే ఈ దుంపలను ఉడికించుకుని, కాల్చుకుని లేదా వేయించి కూరగా చేసుకుని కూడా తినొచ్చు.