మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని బుధవారం నిర్మల్ జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కార్తీక్ మాట్లాడుతూ దేశ అభివృద్ధికి ఎనలేని కృషిచేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్ పేయి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నరేంద్ర చారి తదితరులు పాల్గొన్నారు.