వైసీపీ అధినేత వైఎస్ జగన్ కడప జిల్లా పులివెందుల పర్యటనలో స్వల్ప ఉద్రికత్త చోటు చేసుకుంది. పార్టీ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల నుంచి పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో తోపులాట జరగడంతో కార్యకర్తలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో కార్యాలయం కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి.